తమిళంలో 2017 లో మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం విక్రమ్ వేధ. ఈ చిత్రంను ఇద్దరు దర్శకులు రూపొందించారు. పుష్కర్-గాయత్రి. ఈ చిత్రంలో శ్రద్ద శ్రీనాథ్, వరలక్ష్మి శరత్ కుమార్ లు హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం తమిళనాడులో మంచి విజయం సాదించింది. ఈ చిత్రాని తెలుగులో రీమేక్ చెయ్యాలని సురేశ్ ప్రొడక్షన్స్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
రీమేక్ రైట్స్ ను కూడా సురేష్ ప్రొడక్షన్స్ దక్కించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. వెంకటేష్ మరియు మరో స్టార్ హీరో తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకుపోవాలని సురేష్ బాబు ప్లాన్ చేశాడు. కానీ కొన్ని కారణాల వలన ఆ చిత్రం ఆగిపోయింది. కానీ బాలీవుడ్ లో విక్రమ్ వేధ రీమేక్ పనులు చక చక జరుగుతున్నాయి. ఆ చిత్రం రీమేక్ లో నటించేందుకు హృతిక్ రోశన్, సైఫ్ అలీఖాన్ లు సిద్దం అయ్యారు. ఇందుకోసం ప్రత్యేకంగ వారు తమ డేట్స్ నుకూడా కేటాయించారు.
ఆ చిత్రంలోని రెండు పవర్ ఫుల్ పాత్రలు విక్రమ్, వేధ. గ్యాంగ్ స్టార్ వేధ పాత్రలో హృతిక్ రోశన్ నటించనున్నాడు. పోలీసు ఆఫీసర్ విక్రమ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించనున్నాడని తెలుస్తుంది. తమిళంలో విక్రమ్ వేధ చిత్రానికి దర్శకత్వం వహించిన పుష్కర్- గాయత్రి లు బాలీవుడ్ రీమేక్ కు దర్శకత్వం వహించనున్నారని సమాచారం.