మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనా బారిన పడ్డట్లుగా స్వయంగా చెప్పిన విషయం తెల్సిందే. హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్ లో ఆమె చికిత్స పొందుతుంది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె కరోనా నుండి బయట పడ్డది. ఆ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించింది. కరోనా నెగటివ్ అంటూ రిపోర్ట్ రావడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్లుగా పేర్కొంది. కరోనా ను తమన్నా చాలా తొందరగా జయించింది. మరో వారం రోజుల్లో ఆమె షూటింగ్ లో కూడా పాల్గొనే అవకాశం ఉంది.
తమన్నా కుటుంబ సభ్యులకు ఇప్పటికే కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడం వారు పూర్తి ఆరోగ్యంతో బయట పడటం జరిగింది. ఇప్పుడు తమన్నా కూడా కరోనాను జయించడంతో ఆ ఫ్యామిలీ మొత్తం కరోనా నుండి విముక్తి అయినట్లే అంటున్నారు. హైదరాబాద్లో ఒక సినిమా షూటింగ్ సందర్బంగా ఆమె కరోనా బారిన పడ్డట్లుగా వార్తలు వచ్చాయి. అది ఏం సినిమా ఏంటీ అనే విషయాలపై క్లారిటీ లేదు. మిల్కీ బ్యూటీ తమన్నా ఆమద్య కాస్త డల్ అయినట్లుగా అనిపించినా కూడా మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.
ప్రస్తుతం ఈమె రెండు సినిమాలతో పాటు ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. చిరంజీవికి జోడీగా కూడా ఈమె లూసీఫర్ రీమేక్ లో నటించేందుకు కమిట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తమన్నా కెరీర్ పూర్తి అయ్యింది అనుకుంటూ ఉండగా అనూహ్యంగా ఈమె వరుసగా సినిమాలు చేయడం అందరికి ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినిమాలతో పాటు తమిళం నుండి కూడా ఈమె బిజీ బిజీగా ఉంది.