శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా శ్వేతబసు ప్రసాద్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం “కొత్తబంగారు లోకం”. ఈ చిత్రం యూత్ ను బాగా ఆకట్టుకోవడంతో మంచి విజయని సాదించింది. తెలుగులో శ్వేత కి ఇది మొదటి సినిమా ఈ చిత్రం తో ఆమె వర్క్ లైఫే మారిపోయింది. వరసగా తెలుగులో అవకాశాలు వచ్చాయి.
రైడ్, కాస్కో, కలవరికింగ్, నువ్వేకడుంటే నేనక్కడుంట అనే చిత్రాలో హీరోయిన్ గా నటించింది. అందులో ఒక్క రైడ్ సినిమా తప్ప మిగిలిన సినిమాలు నిరాశ పరచడంతో తెలుగులో మరల అవకాశాలు లేకుంట పోయాయి. ఆ తర్వాత ఆమె చెప్పుకోలేని కొన్ని కేసులు ఆమె మీద ఫైల్ అవ్వడంతో ఆమె జీవితమే మారిపోయింది. చాలాకాలం జైలు జీవితం గడిపింది. జీవితంలో ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్లింది. ఇక శ్వేత కోలుకోవడం కష్టమే అనుకుంటున్న సమయంలో ఆమెకు పెళ్లి చేశారు.
ఈసందర్భంగా శ్వేత తన భర్తతో విడిపోవడానికి గల కారణాలను చెప్పుతూ… మొదట ఆయన తోడుగా ఉండటంతో తిరిగి మామూలు మనిషిని అయ్యాను. అయిన కష్టాలు మాత్రం మమ్ములను విడిచిపెట్టలేదు. పెళ్లి అయిన కొంతకాలం బాగానే ఉన్న ఆ తర్వాత నా పై ఆంక్షలు మొదలైయ్యాయి. ఏమి చేయాలి అనుకున్న కండిషన్స్ పెట్టేవారు. నా ఫ్రీడం మొత్తం పోయింది. ఎటూ వేళ్ళలేక పోయేదాన్ని, దానికి తోడు మా ఇద్దరి మధ్య అనుకోని సమస్యలు వచ్చాయి.
ఇక విడిపోవడమే కరెక్ట్ అనిపించి ఇద్దరం విడాకులు తీసుకున్నాం.. ఇప్పుడు ఎంతో ఫ్రీడం దొరికింది నాకు నచ్చిన పని నేను చేసుకుంటూ పోతున్నాను. ఇప్పుడు ఓ కొత్త ప్రపంచంలో విహారిస్తున్నట్లుగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుత, శ్వేత బసు ప్రసాద్ ఇండియా లాక్ డౌన్ అనే సినిమాలో వ్యభిచారిపాత్రలో నటిస్తుంది. లాక్ డౌన్ సమయంలో వారు పడ్డ కష్టాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.