బిగ్ బాస్ నాలుగవ సీజన్ నుండి ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన నలుగురు కూడా తమను అన్యాయంగా ఎలిమినేట్ చేశారని ప్రేక్షకులు ఓట్లు వేసినా కూడా తమను ఎలిమినేట్ చేశారని బిగ్ బాస్ నిర్వాహకులపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మొదటి వారం లో ఎలిమినేట్ అయిన దర్శకుడు సూర్య కిరణ్ నుండి మొదలుకుని మొన్న ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ వరకు అంతా కూడా వివిధ ఇంటర్వ్యూల్లో ఓట్ల ప్రకారం ఎలిమినేట్ చేయలేదని ఆరోపించారు.
ఈ విషయంలో టీవీ9 దేవి చాలా గట్టిగానే ఫైట్ చేసింది. ఆమె ఖచ్చితంగా తన కంటే మెహబూబ్ కు తక్కువ ఓట్లు వచ్చి ఉంటాయని బలంగా నమ్ముతోంది. కానీ ప్రేక్షకులు మాత్రం ఆమెను ఎలిమినేట్ చేయడం జరిగింది బిగ్ బాస్ నిర్వాహకులు ప్రకటించి బయటకు పంపించేశారు. ఇక నిన్నటి వారంలో స్వాతి దీక్షిత్ ను ఎలిమినేట్ చేయడం కూడా మళ్లీ చర్చనీయాంశం అయ్యింది.
కచ్చితంగా తనకు ఓట్లు బాగానే వచ్చాయి అని కానీ బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం తనను కావాలనే ఎలిమినేట్ చేశారంటూ పేర్కొంది. ఇక షో లో తాను చేసింది మొత్తం చూపించకుండా కేవలం 5 శాతం మాత్రమే చూపించారని దాంతో ప్రేక్షకులు తనను సరిగా జడ్జ్ చేయలేక పోయారు అనే అభిప్రాయంను వ్యక్తం చేసింది. తన ఎలిమినేషన్ కు ప్రేక్షకులు కారణం కాదని బిగ్ బాస్ నిర్వాహకులే తనను సైడ్ యాంగిల్లో ప్రేక్షకులకు చూపించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
తాను ఎన్నో ఆశలు పెట్టుకుని బిగ్ బాస్ కు వెళ్లాను. కాని ఇలా పంపిస్తారని భావించలేదు. అలాంటప్పుడు ఎందుకు లోనికి పంపించారని స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం మూడు వారాల పాటు హోటల్ లో తనను క్వారెంటైన్ చేశారని కూడా చెప్పుకొచ్చింది.