బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్ పూత్ మృతి విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొదట సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అనుకున్నారు. కాని ఇప్పుడు మాత్రం ఆయను హత్య చేసి ఉంటారు అంటూ చాలా బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. అది కూడా ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి ఆయన మృతికి కారణం అంటూ ప్రచారం జరుగుతోంది.
ఆమె వల్లే సుశాంత్ మృతి చెంది ఉంటాడు అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పలువురు పలు రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయంలో రోజు రోజుకు రియా మెడకు ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్స్ కేసుతో రియాకు సంబంధం ఉందని కొత్తగా వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ డీలర్ తో ఆమెకు ఉన్న సంబంధాల కారణంగా సుశాంత్ కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందంటున్నారు.
రియా చక్రవర్తి విషయంలో సుశాంత్ అభిమానులు చాలా ఆవేశంతో కోపంతో ఉన్నారు. ఆమె విషయం ఏ చిన్నది దొరికినా కూడా వదిలి పెట్టడం లేదు. ఆమెను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఆమె డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని తెలియడంతో సుశాంత్ కు స్లో పాయిజన్ మాదిరిగా స్లో గా డ్రగ్స్ ఇచ్చి అతడి మానసిక పరిస్థతి చెడిపోయేలా చేసి చివరకు అతడు ఆత్మహత్య చేసుకునేలా రియా చేసిందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సుశాంత్ పై విష ప్రభావం జరిగిందని అయితే పోస్ట్ మార్టం ఆలస్యం అవ్వడంతో శ్వేద రంద్రాలతో విషం అనేది కరిగి పోయిందని ఎంపీ సుబ్రమణ్య స్వామి అంటున్నడు. ఆయన మాటలను బట్టి చూస్తే సుశాంత్ పై డ్రగ్స్ ప్రభావం జరిగి ఉంటుందని అంటున్నారు.
కుటుంబ సభ్యలు మరియు కొందరు సుశాంత్ ఇంట పని చేసిన వారు చెబుతున్న దాని ప్రకారం రియా చక్రవర్తి చాలా సార్లు సుశాంత్ కు డాక్టర్ సూచించని మాత్రలను ఇచ్చింది. వాటితో అతడు బాగా నిద్రపోయేవాడు. అప్పుడు రియా పై అంతస్తులో పార్టీ చేసుకునేది అంటూ చెబుతున్నారు. మొత్తానికి ఈ కేసులో రియా డీప్ గా ఇరుక్కున్నట్లే అంటున్నారు.
ఈమెతో పాటు ఈమెకు సహకరిస్తున్నట్లుగా అనుమానం వ్యక్తం అవుతున్న ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ కూడా కేసులో ఇరుక్కున్నాడు. ఆయనకు రియా చక్రవర్తికి మద్య ఏదో సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.