తెలుగు, తమిళ సినిమాలో ఒకప్పుడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సురేష్ బాబు. తమిళంలో వంద సినిమాలకు పైగా హీరోగా నటించాడు. “పణీర్ పుష్పాంగల్” అనే చిత్రంతో సినిమా ప్రపంచంకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం 1981 లో విడుదలైంది.. అప్పటి నుండి ఇప్పటివరకు నటిస్తూనే ఉన్నాడు. తెలుగులో మాత్రం “ప్రార్థన” చిత్రంతో గుర్తింపు వచ్చింది.
తమిళ్ లో చాలా సినిమాలను కూడా నిర్మించాడు. తాజాగా సురేష్ బాబు ఈటివి లో జరిగే ఆలీతో సరదాగా అనే షో కి గెస్ట్ గా వచ్చాడు. ఆ సమయంలో ఆయన జీవితంలోని చాలా ఆసక్తి కర విషయాలను ఆయన అభిమానులతో, సినిమా ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో తెలుగులో అప్పట్లో ఓ ప్రముఖ హీరోయిన్ తో ఎప్పైర్ పెట్టుకున్నట్లుగా, ఆ విషయం పేపర్ లో రావడం అప్పటి నుండి ఆ హీరోయిన్ మరియు సురేష్ బాబు ఒకరికి ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. ఆ విషయాని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నాడు.
తమిళంలో “ఇలాంజోడిగల్” అనే చిత్రంలో సురేష్ బాబు, కార్తీక్, రాధా, లు నటించారు. ఈ చిత్రానికి రామా నారాయణ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ఫెయిర్ గా కార్తీక్ రాధా కలిసి నటించారు. సురేష్ బాబు మరో హీరోయిన్ తో జతకట్టాడు. ఆ సమయంలో ఈ చిత్రా నిర్మాత శకుంతల ప్రమోషన్ కార్యక్రమంలో నాకు మరో హీరోయిన్ కి ఎఫ్ఫైర్ ఉందని ప్రచారం చేశారు. పేపర్ లో కూడా ఆర్టిక్ లు రావడంతో ఆ హీరోయిన్ నాతో అప్పటి నుండి మాట్లాడటం మానేసింది నేను కూడా ఆమెతో మాట్లాడటం మానేశాను.
ఈ విషయం పై నేను నిర్మాతతో కలిసి అరా తీయగా అసలు విషయం బయటపడింది. ఈ చిత్రంలో నటించిన మరో ఫెయిర్ ఈ పుకారు పుట్టించారనే విషయం నాకు ఆ హీరోయిన్ కి తెలిసింది. అయిన కానీ ఇద్దరం మాట్లాడుకోలేదు. ఈ మధ్యనే బాలకృష్ణ షూటింగ్ ఔట్ డోర్ లో జరుగుతున్నప్పుడు ఆ హీరోయిన్ ఓ సినిమా షూటింగ్ నిమిత్తం అక్కడికి వచ్చింది.
ఆ సమయంలో నేను అక్కడే ఉండటంతో ఆ విషయంపై మరోసారి చర్చించుకున్నాం. ఒకరికొక్కరం మిస్ అండర్ స్టాండింగ్ వలనే ఇన్ని రోజులు మాట్లాడుకోలేదు అని తెలుసుకున్నాం. ఆ తర్వాత నుండి మేము మంచిగానే మాట్లాడుకుంటున్నాం ఆమె ఎవరో కాదు విజయశాంతి అని చెప్పాడు. మేము మాట్లాడుకోకున్న కానీ ఆమె నాతో కలిసి ఓ ఆరు ఏడు సినిమాల్లో నటించింది.