మన సమాజంలో పురుషులకు, స్త్రీలకు చాలా విషయాల్లో న్యాయం వేరుగా ఉంటుంది. మగవాళ్లు ఎన్ని పెళ్లిల్లు చేసుకున్నా తప్పు పట్టని ఈ సమాజం ఆడవాళ్లు రెండో పెళ్లి చేసుకున్నా తట్టుకోలేరు. ఏదో తప్పు చేసేసినట్లు చూస్తుంటారు. అయితే ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త మారుతోంది. అయితే సెలబ్రిటీల విషయంలో ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సింగర్ సునీత.
అయితే సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోవడంపై మిశ్రమ స్పందన వ్చింది. అప్పటికీ సునీత పెళ్లిపై చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. సునీత వివాహం తర్వాత అదే రేంజ్ లో పెళ్లి వార్తలు వ్చింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించే. అయితే ఆమె భర్త చనిపోయిన తర్వాత ఆమె రెండో పెళ్లికి సిద్ధం అయినట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయంపై సురేఖా వాణితో పాటు ఆమె కుమార్తె సుప్రీత కూడా స్పందించారు. ఇవన్నీ అవాస్తవమేనంటూ కొట్టి పారేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రీత తన విషయంపై షాకింగ్ కామెంట్లు చేసింది. తల్లికి మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన తనకు ఉన్నట్లు తెలిపారు. అయితే పెళ్లి నిర్ణయం పూర్తిగా తన తల్లికి సంబంధించిందని తెలిపింది. తనకు మాత్రం తన తల్లి మరో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే చూడాలని ఉన్నట్లు సుప్రీత స్పష్టం చేసింది
. కానీ ఈ విషయంలో ఏం జరుగుతుందో కాలమే చెప్పాలని అంది. నాన్న చనిపోయి అప్పుడే మూడేళ్లు అవుతుందని… ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్నామని వివరించింది. ప్రస్తుతం సురేఖ వాణి కెరియర్ గురించే ఎక్కువగా ఆలోచిస్తుందని ఆమె కూతురు సుప్రీత వివరించింది.