సూపర్ స్టార్ మహేశ్ బాబు పేరు వింటే చాలు అభిమానులు సంతోషఆనికి హద్దుండదు. ఆయన గుర్తుకు వస్తే చాలు ఆ నవ్వు మొహమే గుర్తుకు వస్తుంటుంది చాలా మందికి. అయితే తెరపై అన్ని రకాల ఎమోషన్స్ ను పండించే మిల్క్ బాయ్.. మీడియా ముందుకు వచ్చినప్పుడు మాత్రం మామూలుగానే ఉంటారు. అందరినీ చిరు నవ్వుతో పలకరిస్తుంటారు. అయితే ఆయన సినిమాలు హిట్టయితే ఆనందంగా ఉంటారన్న విషయం మన అందరికీ తెలిసిందే. మరి తన సినిమా ఫ్లాప్ అయితే ఆయన ఏం చేస్తారో మాత్రం చాలా మందికి తెలియదు. అయితే మనం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
అయితే ఇటవీలే మిల్క్ బాయ్ మహేశ్ బాబు బాలయ్య అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ షోలో బాలకృష్ణ గారితో మాట్లాడుతూ… సైనికుడు, అతిథి సినిమాల తర్వాత మూడేళ్లు ఎందుకు గ్యాప్ తీసుకున్నారో మహేశ్ బాబు తెలిపారు. వరుస ఫ్లాప్ లు వచ్చిన తర్వాత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందని… ఆ సమయంలోనే తనను తాను కొత్తగా మలుచుకున్నానని మహేశ్ బాబు వెల్లడించారు. ఆ మూడేళ్ల సమయం తన కెరియర్ కు ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. అప్పటి నుంచి ఇప్పడి వరకు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదని అన్నారు. హిట్లు వచ్చినా ఫ్లాప్ లు వచ్చినా మనపై మనకు నమ్మకం ఉండాలని మహేశ్ బాబు చెప్పారు.
అయితే కేవలం సినిమా సక్సెస్ అయినప్పుడే తాను బాధ్యత తీసుకోకుండా… ఫ్లాప్ అయినప్పుడు కూడా బాధ్యనంతా తానే తీసుకుంటానని వివరించారు. తన వల్లే ఆ సినిమా అలా అయిందని భావిస్తానని చెప్పారు. అందుకే కథను విన్నప్పుడే కరెక్ట్ డిసీషన్ తీసుకుంటానని… తన నిర్ణయమే ఫైనల్ చేసుకుంటానని పేర్కొన్నారు. సినిమా ఫ్లాప్ అయినా మహేశ్ బాబు బాధ్యత తీసుకుంటాననడం చాలా సంతోషంగా ఉందంటూ… నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.