కమెడియన్ సునీల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కమెడియన్ గా సినీ కెరియర్ మొదలు పెట్టిన సునీల్..ఆ తర్వాత హీరోగా మరి విజయాలు అందుకున్నాడు. కానీ ఆ విజయాలు ఎంతో కాలం నిలువలేదు. హీరోగా మూడు విజయాలు అందుకున్నాక..ఆ తర్వాత వరుస ప్లాపులు వచ్చాయి. దీంతో మళ్లీ కమెడియన్ వైపు ఫోకస్ పెట్టాడు. కానీ మునుపటి మాదిరిగా నవ్వించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో అనుకోకుండా విలన్ రోల్ తలుపు తట్టింది. ‘కలర్ ఫోటో’ సినిమాలో సునీల్ విలనిజాన్ని బాగానే పండించారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’లోనూ ఆయన ఓ విలన్‌గా నటించనున్నట్లు వార్తలొచ్చాయి.
తాజాగా సునీల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తర్వలోనే ఓ సినిమాకు దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఓ మరాఠా సినిమా సునీల్‌ను బాగా ఆకర్షించిందని, దాని రైట్స్ తీసుకున్న తానే స్వయంగా రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అన్ని ఏర్పాట్ల జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. మరి దీనిపై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది.