మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే వేదాళం రీమేక్ , అలాగే లూసిఫర్ చిత్రాల రీమేక్ లలో నటించేందుకు ఓకే చెప్పాడు. వేదాళం రీమేక్ ను మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా..లూసిఫర్ రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారా అనేది అర్ధం కావడం లేదు. మొదట్లో సాహో ఫేమ్ సుజిత్ చేతికి అప్పగించారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత సుజిత్ మార్పులు పెద్దగా నచ్చలేదని , వినాయక్ కు ఆ బాధ్యత ఇచ్చారని అన్నారు.
ఆలా కొద్దీ రోజులు వినాయక్ పేరు ప్రచారమైనప్పటికీ , ఆ తర్వాత మరోక దర్వకుడు మోహన్ రాజా పేరు తెరపై వచ్చింది. మళ్లీ ఏమైందో ఇప్పుడు సుజిత్ పేరు వినిపిస్తుంది. ఇప్పటికే మెగాస్టార్ చెప్పిన మార్పులను బట్టి సినిమా స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడట. ఇక ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి మాటలు రాసున్నారని వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం చిరు..కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. సోమవారం నుండి ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో మొదలైంది. కాజల్ సైతం ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యింది.