శ్రీనివాస్ అవసరాల నటుడుగా, రచయతగా, సినిమా నిర్మాతగా, దర్శకుడుగా అల్ రౌండర్ ప్రతిభను చూపిస్తున్నాడు. హీరో నాగ శౌర్య తో పలాన అబ్బాయి పలాన అమ్మాయి అనే సినిమాను లాక్ డౌన్ కు ముందే మొదలు పెట్టాడు. కొంత భాగం షూటింగ్ చేశారు. తర్వాత షెడ్యూల్ కోసం ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేశారు. అయితే ఆ సమయంలో కరోనా వచ్చి లాక్ డౌన్ పడింది. ఇప్పుడు అన్నీ సద్దుమణిగిన ఈ చిత్రం యొక్క షూటింగ్ మాత్రం సెట్స్ పైకి వెళ్ళడం లేదు. అందుకు కారణం ఈ చిత్రం యొక్క బడ్జెట్ నాగ శౌర్య కు ఉన్న మార్కెట్ ను దాటి పోవడమే.
ఈ చిత్రాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్ బ్యానర్ పై విశ్వ ప్రసాద్-వివేక్ కుచ్చుబొట్ల నిర్మాతలు. మొదటి నుండి కూడా ఈ చిత్రం పోస్ట్ పోన్ అవ్వలేదు అని చెప్పుకుంటనే వస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఆగిపోవడంతో శ్రీనివాస్ అవసరాల అయోమయంలో పడ్డాడు. ఈ చిత్రంతో ఆయనకు హ్యాట్రిక్ అవ్వుతుంది. అందుకే చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మొదటి చిత్రం ఊహలు గుసగుస లాడే చిత్రంతో కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత నారా రోహిత్, నాగ శౌర్యలతో జో అచ్యుతానంద అనే మల్టీస్టారర్ చిత్రంను రూపొందించాడు.
నాగ శౌర్య కూడా ఈ చిత్రం యొక్క షూటింగ్ పై ఆశలు వదిలేసుకున్నాడు. జరిగినప్పుడు చూద్దాంలే అనే ఆలోచనలో ఉన్నాడు. ఈ చిత్రంలో మాళవిక నాయర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. నాగ శౌర్య సినిమాల విషయానికి వస్తే వరస ఫ్లాప్స్ వెంటాడుతున్న వరుడు కావలెను లక్ష్య సినిమాలలో నటిస్తున్నాడు. లక్ష్య సినిమా టీజర్ ను విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచాడు.