1996 లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలోనే వచ్చిన పెళ్లి సందడి సినిమా సూపర్ డూపర్ హిట్ ను దక్కించుకుంది. ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడికి పది రెట్లు లాభాలను నిర్మాతలకు తెచ్చిపెట్టిందనే టాక్. అందుకే ఇప్పుడు అదే టైటిల్ తో రాఘవేంద్రరావు కొత్త సినిమా చేయబోతున్నాడు. పాత సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించగా ఈసారి పెళ్లిసందడి సినిమా లో ఆయన తనయుడు రోహన్ నటిస్తున్నాడు.
రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ చిత్రాన్ని నూతన దర్శకురాలు గౌరి రోనక్ తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు సంబంధించి పనులు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో శ్రీకాంత్ నటించనున్నట్లు తెలుస్తోంది. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆయన కనిపించబోతున్నారట. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.