శ్రీ రెడ్డి పేరు తెలుగు, తమిళ రాష్ట్రాలకు బాగా సుపరిచితమైన పేరు. టాలీవుడ్ లో అడపాదడపా ఓ రెండు సినిమాల్లో నటించిన గుర్తింపు మాత్రం రాలేదు. క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె గొంతువిప్పడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రముఖ హీరోలను టార్గెట్ చేస్తూ తిట్లదండకం మొదలు పెట్టింది. ఆ తర్వాత తెలుగు సినిమా ఆమెను బహిస్కరించడంతో చెన్నై కు మకాం మార్చింది.
అక్కడ కూడా ఆమె నోరు ఉరికనే లేదు. కోలివుడ్ లోని కొంతమంది హీరోల పేర్లు తెరపైకి తీసుకు వచ్చింది. శ్రీ రెడ్డి ఎక్కడ పోయిన ఇంతే అని చాలా మంది ఆమెను పట్టించుకోవడం మానేశారు. ఈ నేపథ్యంలో ఆమె యూట్యూబ్, ఇంస్టా గ్రామ్ ద్వారా నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలో ఆమె త్వరలో ఓ గుడ్ న్యూస్ ను చెప్పబోతున్నట్లుగా ప్రకటించింది.
ఆమె అభిమానులు ఆ విషయం ఏమై ఉంటుందా అని అరా తీయడం మొదలు పెట్టారు కానీ అసలు విషయం ఎవరికి తెలియదు. ఇలాంటి సమయంలో ఆమె నేడు తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా అసలు విషయం తెలిపింది. అది ఏమిటి అంటే మాజీ నటి స్వర్గీయ శ్రీ సిల్క్ స్మిత బయోపిక్ లో నటిస్తున్నట్లుగా ప్రకటించింది.
ఈ బయోపిక్ చిత్రంతో మధు అనే కొత్త దర్శకుడు పరిచయం అవ్వుతున్నాడు. ఇంతకు ముందు బాలీవుడ్ నటి విద్యాబాలన్ సిల్క్ స్మిత బయో పిక్ “డర్టీ పిక్చర్” లో నటించింది. ఈ చిత్రం తెలుగు, తమిళంలో కూడా మంచి విజయని సాదించింది. ఇప్పుడు శ్రీ రెడ్డి, సిల్క్ స్మిత బయోపిక్ తో యూత్ లో మరోసారి హీట్ పుట్టించడం ఖాయం అని తెలుస్తుంది.
మాములుగానే శ్రీ రెడ్డి ఫుల్ ఎక్స్ ఫోజింగ్ చేస్తుంది. ఇంకా సిల్క్ బయోపిక్ అంటే మాస్ మసాలా ఏ రేంజ్ లో ఉండనున్నదో మనం ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఈ చిత్రం ద్వారా అయిన శ్రీ రెడ్డి మరల బిజీ అవ్వుతుందేమో చూడాలి.