
బిగ్ బాస్ ఓటీటీ రచ్చ మొదలైందిం. 17 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ షోను చూసేందుకు అభిమానులు తెగ ఎదురు చూశారు. అయితే అభిమానులను ఉర్రూతలూగించేందుకు బిగ్ బాస్ టీం సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకొచ్చారు. వారియర్స్ వర్సెస్ ఛాలెంజర్స్ అంటూ రెండు గ్రూపులుగా విడగొట్టారు. గత సీజన్లలో బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చిన వారిని కూడా ఈ సీజన్ కి తీసుకొచ్చారు.

అయితే ఈ సీజన్ లో ఎక్కువగా అమ్మాయిలే ఉండటం గమనార్హం. మొత్తం 10 మంది అమ్మాయిలు ఉండగా… ఏడుగురే పురుషులు ఉన్నారు. అందులో ఒకడైన యాంకర్ శివను స్రవంతి చొక్కారపు తెగ ఆట పట్టిస్తోంది. ఉదయాన్నే అందరూ స్నానాలు చేశాం.. నేనైతే ఫ్రెష్ అంటూ యాంకర్ శివ అనగా… నీవు ఫ్రెష్ అంటే నేను నమ్మనంటూ స్రవంతి డబుల్ మీనింగ్ డైలాగ్ తో రెచ్చిపోయింది.
అయితే మొదటి రోజే అమ్మాయిలో అబ్బాయిలను ర్యాగింగ్ చేయించాడు బిగ్ బాస్. వినోదం పంచడంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఒక అడుగు ముందున్నారు.