గాన గంధర్వ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యం విషమంగా ఉంది అంటూ వారం రోజుల క్రితం ఆయనకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న ఆసుపత్రి వర్గాల వారు ప్రకటన చేసిన విషయం తెల్సిందే. కరోనాతో ఆ ఆసుపత్రిలో జాయిన్ అయిన బాలసుబ్రమణ్యం గారు కొన్ని రోజులు సాదారణంగానే ఉన్నా ఆ తర్వాత తర్వాత ఆయనకు శ్వాసకు సంబంధించిన సమస్య రావడం మొదలయ్యింది.
కరోనా కారణంగా ఊపిరి తిత్తులు పని చేయడం తగ్గి పోయిందని దాంతో ఆయన ఊపిరి సమస్యగా మారిందని వైధ్యులు అంటున్నారు. ఎప్పుడైతే ఆయనకు ఊపిరి సమస్యగా ఉందో అప్పటి నుండి ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఆయనకు ప్రస్తుతం కృతిమ శ్వాస అందిస్తున్నారు.
కరోనా కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యి తీవ్ర అస్వస్థతకు గురైన ఎస్పీ బాలు గారి ఆరోగ్యం కుదుట పడినది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు మరియు ఆసుపత్రి వర్గాల వారు క్లారిటీ ఇచ్చారు. నిన్న సాయంత్రం సమయంలో విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో బాలు గారి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది.
ఆయనకు లైఫ్ సపోర్ట్ ఇచ్చాం. కృత్రిమ శ్వాసను అందిస్తూ ఆయన ప్రాణాలను నిలుపుతున్నాం అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాంటూ నెటిజన్స్ మరియు సినీ ప్రముఖులు ప్రార్థనలు చేస్తున్న విషయం మనం చూడవచ్చు.
ఇటీవలే ఇళయరాజా మాట్లాడుతూ మన ఇద్దరి మద్య గొడమ ఉన్నా అవి మన స్నేహంను డామినేట్ చేయలేదు. మనం ఇద్దరం ఎప్పుడు స్నేహితులం. నువ్వు త్వరగా లేచి రా అంటూ ఇళయరాజా ఎమోషనల్‌గా ట్వీట్ చేశాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయంలో స్పందించాడు. ఒక వీడియోను విడుదల చేసిన మెగాస్టార్ అందులో బాలు ను అన్నయ్య అంటూ సంభోదించాడు. అన్నయ్య ఖచ్చితంగా త్వరలో కోలుకుని బయటకు వస్తారు.
ఆయనతో నాకు ఉన్న అనుబంధం కేవలం సినిమాలు మాత్రమే కాదు. ఆయన కుటుంబం మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంటాం. నేను ఆయన్ను అన్నయ్య అని పిలిస్తే ఆయన చెల్లెల్లు నన్ను అన్నయ్య అంటూ పిలుస్తారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాలు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మనము కోరుకుందాం.