ఎక్కడ ఏఆపద ఉన్నా క్షణాల్లో సాయం చేసేందుకు ముందుకొస్తున్న రియల్ హీరో సోనూసూద్. లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి ఎందరికో సాయం చేస్తూ యావత్ భారతదేశానికి రియల్ హీరోగా మారిపోయారు. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 4 నెలల పసిబిడ్డ వైద్యచికిత్సలకు అయ్యే ఖర్చు భరిస్తానని ట్విట్టర్ ద్వారా భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన పందిపెల్లి బాబు, రజిత దంపతుల కుమారుడు అద్విత్ శౌర్య (4నెలలు) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. బాబు సిరిసిల్లలో ఓ కొరియర్ సంస్థలో బాయ్‌గా పనిచేస్తున్నాడు. బాబు తన కుమారుడిని ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. డాక్టర్స్ వెంటనే హార్ట్ సర్జరీ చేయాలని.. ఇందుకు రూ. 8 లక్షల ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. వారి దగ్గర అంత స్థోమత లేకపోవడంతో సహాయం కోసం చాలామందిని అడిగారు. అయితే ప్రతీ చోటా వారికి నిరుత్సాహమే ఎదురైంది.
కాగా, తల్లిదండ్రుల ఆవేదనను గుర్తించిన కొంతమంది గ్రామస్థులు.. విషయాన్ని సోనూసూద్‌కు చేరేలా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానిని చూసిన నటుడు సోనూసూద్ వెంటనే స్పందించారు. గుండె సంబంధిత సర్జరీకి అయ్యే ఖర్చు మొత్తాన్ని తాను భరిస్తానని.. హైదరాబాద్ ఇన్నోవా హాస్పిటల్‌లో ఆపరేషన్‌కు ఏర్పాటు చేశామని ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఆయన సిబ్బంది బుధవారం బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. ఆపరేషన్‌ను డాక్టర్ కోన సాంబమూర్తి చేయనున్నట్లు తెలిపారు.
It’s an urgent surgery.
Surgery is confirmed for tomorrow @InnovaHeart Hospital. Dr. Kona Samba Murthy @konasambamurthy will take good care. All The Best & wishing the kid a speedy recovery. @IlaajIndia https://t.co/LWYHXROaFt— sonu sood (@SonuSood) November 11, 2020