అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎఫ్ 2. తమన్నా,మెహరిన్ లు హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం 2019 లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాని దిల్ రాజు 30 కోట్లు పెట్టి నిర్మిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద 120 కోట్ల వరకు రాబట్టింది. ఫ్యామిలీ అండ్ కామిడీ ప్రధానంగా ఈ చిత్రాని రూపొందించారు.
ప్రస్తుతం అనీల్ ఈ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్ 3 చిత్రాని రూపొందిస్తున్నాడు. నిర్మాత దిల్ రాజు 80 కోట్లవరకు ఖర్చు చేస్తున్నాడు. ఎఫ్ 2 చిత్రంలో నటించిన భారీ తారాగనమే, ఎఫ్ 3 లోను నటిస్తున్నారు. తాజా సమాచారం మేరకు దర్శకుడు అనీల్ ఈ చిత్రానికి మరింత గ్లామర్ ను తీసుకువచ్చే పనిలో ఉన్నాడు. అందుకే మూడో హీరోయిన్ ను కూడా తీసుకున్నాడు. బాలకృష్ణ తో వరసగా మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సొనాలి చొహన్ ఎఫ్ 3 కోసం తీసుకుంటున్నారు. ఇప్పటికే దర్శకుడు ఆమెతో సంప్రదింపులు కూడా జరపడం జరిగింది అంట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. లాక్ డౌన్ సడలింపులు జరిగిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టిన ఈ చిత్రం సగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
ఎఫ్ 3 చిత్రం తర్వాత అనీల్ రావిపూడి మహేష్ తో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్ కు సరిలేరు నికేవ్వరు అనే సినిమాను ఇచ్చాడు. ఆ చిత్రం మంచి సక్సెస్ ను అందుకుంది. బాలకృష్ణ తో కూడా ఓ సినిమా లైన్ లో ఉంది. అది గోపిచంద్ మలినేని, బాలకృష్ణ చిత్రం తర్వాత సెట్స్ పైకి వెళ్లనున్నది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో #BB3 అనే చిత్రంలో నటిస్తున్నాడు.