దాదాపు 9 నెలల తర్వాత థియేటర్స్ లలో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లే సాధిస్తూ మిగతా సినిమాలకు లైన్ ఇచ్చింది. అసలు సినిమాకు జనాలు వస్తారా రారా అనే అనుమానంతో సినిమాని విడుదల చేయగా, ఈ చిత్రానికి నీరాజనం పలుకుతుండడం తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.
తొలి రోజే 4.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజూ అదే హవా కనబర్చింది. రెండో రోజుకు గాను 3.29 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక మూడో రోజు ఆదివారం 2.81 కోట్ల గ్రాస్ రాబట్టి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10.8 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. తొలి వీకెండ్ సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ కావడం, ఇప్పట్లో థియేటర్స్ లోకి వచ్చే పెద్ద సినిమాలు లేకపోవడం సెకండ్ వీక్‌లో ఈ సినిమాకు బాగా కలిసొస్తుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కరోనా నిబంధనల ప్రకారం 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ నడుస్తున్నాయి. అయినప్పటికీ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం మంచి కలెక్షన్లు రాబడుతుంది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మించగా.. సుబ్బు డైరెక్ట్ చేసాడు. సుబ్బు కు ఈ చిత్రం మొదటిది కావడం విశేషం. నభా నటేష్ హీరోయిన్ గా నటించింది.