తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఫైనల్ ఫైవ్ కు చేరుకున్న వారిలో ముఖ్యంగా చెప్పుకోవాలిసిన వారు ముగ్గురు. అందులో అభిజీత్, అఖిల్, సోహెల్ లు ముందు వరస లో ఉంటారు. ఈసారి సీజన్ ఫోర్ విన్నర్ గా బయటకు వచ్చిన అభిజిత్ మాత్రం సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ లు ఇస్తూ సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్నాడు. ఇంకా మిగిలిన ఇద్దరిలో అఖిల్ ఇప్పటికే తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అనే టైటిల్ నేమ్ తో సినిమాను చేస్తున్నాడు.
ఈ చిత్రానికి బాస్కర్ బంతుపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. సరస్వతి క్రియేషన్స్ పై బాస్కర్ రావు నిర్మిస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో లవ్ వ్యవహారం నడిపిన ఈ జంట ప్రస్తుతం సినిమాలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోహెల్ కూడా ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నేడు పూజ కార్యక్రమాలతో ఈ చిత్రాణి ఘనంగా లాంఛ్ చేశారు. జార్జి రెడ్డి చిత్రాని నిర్మించిన అప్పి రెడ్డి ఈ చిత్రాని నిర్మిస్తున్నాడు. ఆయనకు ఇది మూడోవ చిత్రం. ఇంతకు ముందు “ప్రేజర్ కుక్కర్” జార్జి రెడ్డి సినిమాలను నిర్మించాడు.
అలాగే ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా నేను లోకల్ మహానుభావుడు సినిమాలకు పనిచేసిన నిజార్ షఫీ సోహెల్ సినిమాకోసం పనిచేస్తున్నాడు. ఈ చిత్రం తో ఓ నూతన దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. ఆయనే శ్రీనివాస్ వింజనం పాటి. శ్రావణి భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు సైడ్ క్యారెక్టర్ పాత్రలు వేసిన సోహెల్ ఇక నుండి హీరో వేషాలు వేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే పూర్తీ వివరాలు తెలియనున్నాయి.