సూపర్ స్టార్ మహేష్ బాబు గారల పట్టి సితార సోషల్ మీడియా లో ఎంతో యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఫొటోస్ తో ఆకట్టుకునే ఈ చిన్నారి ..ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్‌గా మరి అందర్నీ ఆశ్చర్య పరిచింది.
3డీ యానిమేషన్ వెబ్‌సిరీస్ ఫంటాస్టిక్
కు సితార బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైంది. ఈ వెబ్ సిరీస్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నమ్రతా శిరోద్కర్, సితార బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియా హాజరయ్యారు. ఈ సిరీస్ మొదటి సీజన్ వచ్చే ఏప్రిల్‌లో విడుదల కాబోతోంది. సితార బ్రాండ్ అంబాసిడర్ కావడం తో మహేష్ అభిమానులతో పాటు చిత్రసీమ ప్రముఖులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.