గత కొద్దీ రోజులుగా సింగర్ సునీత రెండో వివాహం చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ సునీత మాత్రం ఆ వార్తలను కొట్టిపారేసింది. అయితే సడెన్ గా ఏమైందో ఏమో కానీ సోమవారం నిశ్చితార్థం చేసుకొని షాక్ ఇచ్చింది.
డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో సోమవారం సునీత నిశ్చితార్థం జరిగింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సునీత తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా “ప్రతి తల్లిలాగానే నేను నా పిల్లలు లైఫ్‌లో సెటిల్ కావాలని ఆశించాను. అదే సమయంలో నేను జీవితంలో స్థిరపడాలనుకునే మంచి ఆలోచన ఉన్న పిలలతో నేను ఆశీర్వదించబడ్డాను. రామ్ నా జీవితంలో ఒక శ్రద్ధగల స్నేహితుడిగా, అద్భుతమైన భాగస్వామిగా ప్రవేశించాడు. . మేం ఇద్దరం అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నాం. నేను నా జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుతున్నాను. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు” అని సునీత పోస్ట్ చేసింది.
సునీతకు19 ఏళ్ల వయసులోనే పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త వేధింపులు భరించలేక ఆమె విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం పిల్లల బాధ్యతను ఆమే చూసుకుంటున్నారు. అయితే కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంపై ఎన్నో పుకార్లు వచ్చినా సునీత వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. రెండో పెళ్లి విషయంపై కొద్దిరోజులుగా వార్తలొస్తున్నా ఆమె స్పందించలేదు. తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుని అన్నింటికీ చెక్ పెట్టేసింది.