శ్రేయ గోషల్ ఈ పేరు ఎక్కడో వినట్లుగా ఉంది కదు. ప్లే బ్యాక్ సింగర్ గా కెరీర్ ను మొదలు పెట్టి ఇప్పుడు తానో ఓ గొప్ప సింగర్ గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్, శాండిల్ వుడ్ లో ఎన్నో పాటలు పాడింది. తెలుగులో మాత్రం మహేశ్ బాబు హీరోగా నటించిన ఒక్కడు చిత్రంతో ఆమె ఇక్కడ అడుగు పెట్టింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిచాడు. ఆయన గ్రూప్ లో ప్లే బ్యాక్ సింగర్ గా ఆమె కెరీర్ ను ఆరంభించింది.
బాలీవుడ్ లో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఎన్నో జాతీయ అవార్డ్స్ మరియు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను ఆమె గెలుచుకుంది. 2015 లో శైలాదిత్యను ఆమె వివాహం చేసుకుంది. అప్పటి నుండి ఆమె ఎంతో సంతోషం తో జీవిస్తుంది. తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు ఓ శుభవార్తను తీసుకు వచ్చింది. తాను గర్భంతో ఉన్నాను అంటూ గర్భం ను చూసి మురిసి పోతున్న ఓ ఫోటోను ఆమె పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మీ నుండి నాకు ఆశీస్సులు కావాలని కోరింది. అలాగే బేబీ శైలాదిత్య కమింగ్ అంటూ రాసుకొచ్చింది. ఇంకా ఆమె అభిమానులు మాత్రం సోషల్ మీడియా ద్వారా విషెస్ ను తెలియజేస్తూన్నారు. శ్రేయ గోషల్ సినిమా తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తన సత్తా చూపించింది ఈ సింగర్. సరిగమప అనే రియాలిటీ షో లో కూడా ఆమె పాల్గొన్నది. జడ్జ్ గా కొన్ని షోస్ కు ఆమె పనిచేశారు.