ఒకే ఒక్క పాటతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన సింగర్ పార్వతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఏపీలోని కర్నూలు జిల్లా లక్కసాగరం గ్రామానికి చెందిన ఆమె… తన మొదటి పాటతోనే తమ ఊరికి బస్సు వచ్చేలా చేసింది. ఆమె క్షణాన ఆ కోరిక కోరిందో తెలియదు కానీ అప్పటి నుంచి ఎంతో మంది ఆమెను అభిమానిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల గుండెల్లో ఆమె స్థానం సంపాదించుకుంది.
అయితే తాజాగా ఆమెకు మరో అవకాశం వచ్చింది. అతిథిగా వచ్చిన హీరో కార్తికేయ తన తర్వాతి సినిమాలో పాట పాడించేందుకు సంగీత దర్శకుడితో మాట్లాడతానని స్టేజ్ పైనే చెప్పాడు. ఈ విషయం విన్న వారంతా జడ్జీలతో సహా షాకయ్యారు. అంతే కాదండోయ్ సింగర్ పార్వతితో కలిసి కార్తికేయ రెండు స్టెప్పులు కూడా వేశారు. యువన్ శంకర్ రాజా కూడా పార్వతి కచ్చితందా ఉన్నత శిఖరాలను అందుకుంటుందని ఆకాంక్షించారు.
కార్తికేయ ఇచ్చిన క్రేజీ ఆఫర్ తో పార్వతి పేరు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. టాలెంట్ ఉండే అవకాశాలు వాటంతట అవ వెతుక్కుంటూ వస్తాయనే దానికి సింగర్ పార్వతీయే నిలువెత్తు నిదర్శనం. మరి పార్వతి మున్ముందు ఇంకెన్ని అవకాశఆలు దక్కించుకోనుందో చూడాలి.