
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాలను బ్రీచ్ కాండీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ప్రతీత్ సమదాని తెలిపారు. గత కొంత కాలం కిందటే ఈ లెజెండరీ సింగర్ కు కరోనా సోకింది.
92 ఏళ్ల లతా మంగేష్కర్ స్వల్ప కరోనా లక్షణాలతో జనవరి 11న ఆస్పత్రిలో చేరిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అప్పుడు కూడా ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. జనవరి నెలాఖరులో ఆమె కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు తెలిపారు. లతా మంగేష్కర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రకటించారు. అయితే మళ్లీ ఇప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించింది.
ఈ విషయం తెలిసిన అభిమానుంతా కలవర చెందుతున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగుపడి సురక్షితంగా ఇంటికి చేరాలని కోరుకుంటున్నారు. పలువరు అభిమానులు అయితే ఆమె కోలుకోవాలంటూ పూజలు, పునస్కారాలు చేయడం విశేషం.