చిన్మయి ప్లే బాక్ సింగర్ గా మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. ఓ తమిళ సినిమా కు సింగర్ గా పరిచయం అయింది. ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగులో మంచి పాటలు పాడి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్య తమిళ సినిమా ఇండస్ష్ట్రి లో క్యాస్టింగ్ కౌచ్ పై గట్టిగానే విమర్శలు చేసింది. సమాజంలో మహిళలపై జరిగే దాడులు, అత్యాచారలపై ఈమె గట్టిగానే స్పందిస్తారు. చిన్మయి సోషల్ మీడియాలో కూడా బాగా ఆక్టివ్ గా ఉంటారు. ఆమెకు ఫాలోవర్స్ సంఖ్య కూడా బాగానే ఉంది. తాజాగా కొంతమంది నెటిజన్స్ చిన్మయి పై అసభ్యకర కామెంట్స్ చేశారు.
అందుకు సమదానంగా ఆమె వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇటీవల కార్తీక దీపం సీరియల్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది డాక్టర్ బాబు, వంటలక్క కు అనుకూలంగా ప్రసారం అవ్వడంతో చాలా మంది ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. వంటలక్క ఆరోగ్యం బగలేకపోతే, డాక్టర్ బాబు ఆమెను కొట్టి ఆమెకు ముద్దు పెట్టి హాస్పిటల్ కు తీసుకువెళ్ళుతాడు. ఆ ప్రోమో వీడియో ను సింగర్ చిన్మయికి ఓ నెటిజన్ ట్యాగ్ చేశాడు. అలాగే మరో నెటిజన్ రిమూవ్ యువర్ టాప్ అంటూ కామెంట్ చేశాడు. అందుకు ఆమె గట్టిగానే సమదానం ఇచ్చింది.
అమ్మాయిలు మంచి కుటుంబం నుండి వచ్చిన అబ్బాయిల వెంటనే పడతారు. కొంతమంది అబ్బాయిల తల్లితండ్రులు తమ పిల్లలు సోషల్ మీడియాలో ఏమి చేస్తున్నారో చూడరు అని అంది. అలాగే మీ జెండర్ గ్రేట్ జెండర్ మీ వల్ల ఆడవాళ్ళు చాలా సేఫ్ అంటూ అటు కార్తీక దీపం ప్రోమో ను ట్యాగ్ చేసిన వ్యక్తికి మరియు అసభ్యకరమైన కామెంట్ చేసిన వ్యక్తికి ఒకేసారి ఇద్దరికి కౌంటర్ ఇచ్చింది. ఇక చిన్మయి పర్సనల్ విషయానికి వస్తే నటుడు, దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ ను పెళ్లి చేసుకుంది.