బాలీవుడ్ హీరో వరుణ్ దావన్ తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల ముంబైలో అతి తక్కువ మంది, బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఈ తంతు జరిగింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ శుభా కాంక్షలు తెలియజేస్తున్నారు.
కానీ కన్నడ హీరోయిన్ మాత్రం సెటైర్లు వేస్తుంది. ఆమె మరెవరో కాదు శ్రద్దా శ్రీనాథ్. తెలుగులో నాని తో కలిసి జెర్సీ అనే చిత్రంలో నటించింది. సోషల్ మీడియాలో వరుణ్ దావన్, నటాషా దలాల్ ల ఫోటోను షేర్ చేస్తూ ఇకపై వరుణ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యాలంటే నటాషా అనుమతి తీసుకోవాలని. ఆమె కాకుండా ఆమె తరుపు బందువులు, కుటుంబ సభ్యుల పర్మిషన్ కూడా తీసుకోవలెమో అన్నారు. మంచి నటుడు అయిన వరుణ్ ని ఇక నుండి వెండితెరపై చూడలేము అనుకుంటున్న ఫ్యామిలీ లైఫ్ ను వర్క్ లైఫ్ ను వరుణ్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి అన్నారు.
అలాగే ఆయన ఇక నుండి హీరో ఓరియెంటెడ్ మూవీస్ మాత్రమే చెయ్యాలిసి ఉంటుందేమో అనిపిస్తుంది. హీరోయిన్స్ తో నటించేందుకు ఆయన భార్య ఒప్పుకుటుంది అనే నమ్మకం మాత్రం లేదు అన్నారు. అలాగే మేము నిన్ను ఎంతగానో మిస్ అవ్వుతున్నాం వరుణ్ అంటూ తనదైన స్టైల్ లో విష్ చేసింది. శ్రద్దా శ్రీనాథ్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో నరుడు బ్రతుకే నటన అనే చిత్రంలో నటిస్తుంది. వరుణ్ సినిమాల విషయానికి వస్తే కూలీ నెం 1 చిత్రంతో ఈ ఏడాది ఓ సినిమాను విడుదల చేశాడు. ప్రస్తుతం రాజ్ మెహతా దర్శకత్వంలో జగ్ జగ్ జీయో అనే చిత్రంలో నటిస్తున్నాడు. కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.