తమిళ్ ఇండస్ట్రీ లో వరుస మరణాలు అభిమానులను , సినీ ప్రముఖులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలు కారణాలతో పలువురు మరణించగా..తాజాగా ప్రముఖ డైరెక్టర్ శివ ఇంట్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఆయన తండ్రి జయకుమార్ అనారోగ్యంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన రీసెంట్‌గా చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు.
ఈ క్రమంలోనే ఆరోగ్యం కుదటపడకపోవడంతో ఆయన తుది శ్వాస విడిచినట్టు డాక్టర్లు చెప్పారు. జయకుమార్ పలు షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా పలు చిత్రాలను తెరకెక్కించారు. 400పైగా షార్ట్ ఫిల్మ్స్‌కు పనిచేసారు. శివ తండ్రి అంత్యక్రియలు శనివారం చెన్నైలో జరగనున్నాయి. ఈయన మృతికి కోలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
దర్శకుడు శివ విషయానికొస్తే.. ఆయన 2008లో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘శౌర్యం’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా కంటే ముందు ఈయన పలు చిత్రాలకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేసారు. ఆ తర్వాత రవితేజ హీరోగా ‘దరువు’ సినిమాను డైరెక్ట్ చేసాడు. తెలుగు లో ఈయన చేసిన రెండు సినిమాలు ప్లాప్ కాగా..అజిత్‌తో ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ వంటి సినిమాలతో అజిత్ విశ్వాస పాత్రుడైన దర్శకుడిగా మారిపోయాడు. ప్రస్తుతం ఈయన రజినీకాంత్ హీరోగా ‘అన్నాత్తే’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.