పడి పడి లేచే మనసు చిత్రం తర్వాత శర్వానంద్ హీరోగా నటిస్తున్న చిత్రం మహాసముద్రం.ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో తమిళ నటుడు సిద్దార్థ్ నటిస్తున్నాడు. తెలుగులో చాలా హిట్టు చిత్రాలో నటించిన సిద్దార్థ్. ఇక్కడ ఫ్లాప్స్ రావడంతో తమిళ్ ఇండస్ష్ట్రి కి చెక్కేశాడు. ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తున్నాడు. చాలా సంవత్సరాలు తర్వాత మహాసముద్రం చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
సిద్దార్థ్ నటించిన తమిళ చిత్రాలు తెలుగులో డబ్బ్ చేసి విడుదల చేసేవారు. ఇక ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమాన్యుల్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించింది. ఆగష్టు 19 న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం విడుదల అవ్వుతుందని తెలిపింది. డేట్ తో పాటుగా శర్వానంద్, సిద్దార్థ్ లుక్ లనుకూడా పరిచయం చేసింది. ఓ పాత షిప్ పై.. ఇ ఇద్దరు హీరోలు కూర్చొని ఆలోచిస్తున్నట్లుగా ఉన్న ఓ లుక్ ను విడుదల చేశారు.
ఈ చిత్రం యొక్క కథ విషయానికి వస్తే సముద్రం నేపథ్యంలో సాగుతున్న ప్రేమకథ చిత్రంగా తెరకెక్కుతుంది. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుంకర రామబ్రమ్మ ఈ చిత్రాని నిర్మిస్తున్నాడు. శర్వానంద్ ఈ చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఆయన గతంలో నటించిన రెండు చిత్రాలు ఫ్లాప్స్ అందుకోవడంతో ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. హీరో సిద్దార్థ్ కూడా ఈ చిత్రంతో మరల తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.