కన్నడ సినిమాకు చెందిన శనయ కాట్వే అనే నటి తన సొంత తమ్ముడుని ప్రియుడుతో కలిసి ముక్కలు ముక్కలుగా నరికి చంపించింది. ప్రస్తుతం ఈ న్యూస్ కన్నడ సినిమా ఇండస్ష్ట్రి లో హాట్ టాపిక్ అయ్యింది. పూర్తి వివరాలు ఓసారి చూద్దాం.. ఒండు ఘంటేయ కథే సినిమాతో పాటుగా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శనయ కాట్వే , నియాజ్ అహమ్మద్ అనే వ్యక్తి తో పరిచయమై అది కాస్త ప్రేమగా మారడంతో బయట చెట్టపట్టాలేసుకొని పార్కులు పబ్ ల వెంట తెగ తిరిగి ఎంజాయ్ చేశారు.
శనయ కాట్వే ప్రవర్తనలో మార్పు రావడంతో అది గమనించిన ఆమె తమ్ముడు ఆమెను ని పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయిన ఆమె వినలేదు. ఓ సారి ప్రియుడుతో కలిసి అక్క రెడ్ హ్యాండెడ్ గా రాకేశ్ కు పట్టుబడటంతో వారిని హెచ్చరించడం జరిగింది. రాకేశ్…మీ ప్రేమ వ్యవహారం గురించి తండ్రికి చెబుతాను అని బెదిరించాడు. ఇక చేసేది ఏమి లేక శనయ కాట్వే మరియు నియాజ్ అహమ్మద్ లు రాకేశ్ ను చంపాలని నిర్ణయించుకున్నారు. ఆకునట్లుగానే ప్లాన్ చేసి రాకేశ్ ను చంపేశారు. సాక్ష్యాలు పోలీసు లకు దొరకాకుండా రాకేష్ బాడి ని ముక్కలు ముక్కలు గా నరికి హుబ్బళి లో ఉన్నటువంటి వేరు వేరు ప్రాంతాల్లో పడేశారు.
పోలీసు ల ఇన్వెస్టిగేషన్ లో నియాజ్ పేరు బయటకు రావడంతో ఆయనను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. ఈ కేసు లో శనయ కాట్వే పాత్ర ఉన్నదని భావించి పోలీసు లు ఆమెను కూడా అరెస్టు చేశారు. మరి వీరికి కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందో చూడాలి. నియాజ్ అహమ్మద్ పలువురు సినిమా సెలబ్రేటీలకు మేనేజర్ గా పనిచేస్తున్నాడు.