సోలో బ్రతుకే సొ బెట్టర్ చిత్రం తర్వాత సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. జనవరి 26న ఈ చిత్రం యొక్క టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి దేవకట్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ దర్శకుడు వెన్నెల, ఆటొనగర్ సూర్య ప్రస్థానం వంటి సూపర్ హిట్టు చిత్రాలను రూపొందించాడు. ప్రస్తుతం తెలుగులో రిపబ్లిక్ ను తెరకెక్కిస్తున్నాడు.
తమిళ నటి ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్ గా నటిస్తుంది. అలనాటి నటి రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. టాలీవుడ్ మీడియా నుండి అందుతున్న వార్తల నేపథ్యంలో సిఎం గా నటిస్తుందని అంటున్నారు. గత కొన్ని రోజులు గా సాయితేజ్ పాత్ర పై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఐపిఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని కొందరు అంటుంటే లేదు రాజకీయనాయకుడి పాత్రలో కనిపిస్తారు అని మరికొందరు అంటూ వస్తున్న వార్తలు నేపథ్యంలో… మరో తేజ సమాచారం వినపడుతుంది. సాయి ఈ చిత్రంలో ఐపిఎస్ పాత్రలో కాదని ఐఏఎస్ పాత్రలో జిల్లా కలెక్టర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది.
ఈ చిత్రంలోని మేజర్ పార్టు ను ఏలూరు పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. వరస సినిమా ఆఫర్స్ తో ఈ సంగీత దర్శకుడు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ నుండి పది పెద్ద ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయి. ఈ చిత్రాని జే పుల్లారావు జే భగవాన్ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 21 న విడుదల అవ్వుతుంది ఈ చిత్రంతో 14 చిత్రాలను సాయి తేజ్ పూర్తి చేస్తాడు. 15 వ చిత్రంగా కార్తీక్ వర్మ దండు అనే కొత్త దర్శకుడి డైరెక్షన్ లో నటిస్తున్నాడు.