బాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ సారా అలీ ఖాన్ (Sara Ali Khan). లవ్ ఆజ్ కల్, కూలీ నెంబర్ 1, అత్రాంగి రే.. సినిమాల్లో నటించిన ఈ అమ్మడు రీసెంట్ గా వచ్చిన అత్రాంగిరే సినిమాతో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన అత్రాంగిరే సినిమాలో అక్షయ్ కుమార్, ధనుష్ లతో కలిసి నటించింది సారా అలీ ఖాన్. సినిమాలో వివాహితగా నటించిన ఆమె ఈమధ్యనే జరిగిన సక్సెస్ మీట్ లో కాబోయే భర్త మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
తనకు అమ్మే సర్వస్వం అని.. ఆమె ఉంటే సంతోషంగా ఉంటానని.. ఆమె తనకు ఓ ఇల్లు లాంటిదని.. ఎక్కడికి వెళ్లినా సరే చివరికి తిరిగి ఇంట్కి ఎలాగైనా చేరుకుంటా.. ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా అమ్మతోనే టైం స్పెండ్ చేస్తానని అంటుంది సారా అలి ఖాన్. కొన్ని విషయాల్లో తనకు సొంతంగా నిర్ణయం తీసుకోవడం రాదని.. ఇప్పటికీ తాను బయటకు వెళ్లాలంటే ఎలా రెడీ అవ్వాలో అమ్మే చెబుతుందని.. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని అన్నారు సారా అలి ఖాన్.
ఇక తన మదర్ ని వదలి ఉండటం తన వల్ల కాదు.. భవిష్యత్తులో పెళ్లి చేసుకున్నా సరే చేసుకునే వాడు కూడా ఇల్లరికం వచ్చేందుకు ఒప్పుకోవాలని అంటుంది సారా అలి ఖాన్ (Sara Ali Khan). మరి సారా కోరిక మేరకు అలా ఇల్లరికం వచ్చే వ్యక్తి దొరుకుతాడో లేదో చూడాలి.