నందమూరి బాలకృష్ణ (Balakrishna) అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. బోయపాటి శ్రీనుతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న బాలయ్య బాబు తన నెక్స్ట్ సినిమా క్రాక్ డైరక్టర్ గోపీచంద్ మలినేనితో చేస్తున్నాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. క్రాక్ లో జయమ్మ గా అదరగొట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తుంది.
ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో విలన్ గా శాండల్ వుడ్ సెన్సేషన్ దునియా విజయ్ ని తీసుకున్నట్టు ప్రకటించారు. బాలయ్య సినిమాలో విలన్లకు ఓ క్రేజ్ ఉంటుంది. బాలయ్య హీరోయిజానికి ఈక్వల్ గా వారి ఎలివేషన్ ఉంటుంది. అందుకే బాలకృష్ణ తన ప్రతి సినిమాలో ప్రతినాయకుడి పాత్రకు ఎక్కువ స్కోప్ ఇస్తాడు. సిం హాలో జగపతి బాబు, అఖండ లో శ్రీకాంత్ లని విలన్ గా క్రేజ్ తెచ్చాడు బాలకృష్ణ (Balakrishna).
గోపీచంద్ మలినేని సినిమాలో విలన్ గా దునియా విజయ్ ని ఫైనల్ చేశారు. కర్ణాటకలో సూపర్ ఫాలోయింగ్ ఉన్న దునియా విజయ్ తెలుగు తెరకు మొదటిసారి పరిచయమవుతున్నారు. తప్పకుండా దునియా విజయ్ ఎంట్రీ బాలయ్య సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న బాలకృష్ణ 107 మూవీ ఆడియెన్స్ కు డబుల్ క్రాక్ ఇస్తుందని అంటున్నారు చిత్రయూనిట్.