
టాలీవుడ్ క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్యల గరించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత… అదే సినిమాలో నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడింది. ఆ తర్వాత చాలా రోజులు ప్రేమాయణం సాగించిన వీరు ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం… ఆ తర్వాత కొన్నాళ్లకే వీరు విడాకులు తీసుకోవడం కూడా మనందరికీ తెలుసు. అయితే విడాకుల తర్వాత మొదటి సారి సమంత తన మాజీ భర్త నాగ చైతన్య గురించి నోరు విప్పింది. అతను క్యారెక్టర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

కెరియర్ ప్రారంభంలో సమంత దగ్గర ఎక్కువగా డబ్బులు ఉండేవి కాదని.. ఆ సమయంలో నాగ చైతన్యనే తనకు సాయం చేశాడని చెప్పింది. ఒకానొక సమయంలో సామ్ చైతో కలిసి షూటింగ్ చేసేటప్పుడు తన దగ్గర కనీసం అమ్మకు కాల్ చేసి మాట్లాడేందుకు కూడా తన దగ్గర డబ్బులు లేవని చెప్పింది.

అప్పుడు సామ్ పరిస్థితి అర్థం చేసుకున్న చైతన్యనే.. సమంత దగ్గరకు వెళ్లి తన ఫోన్ ఇచ్చి నీ ఇష్టం వచ్చినంత సేపు ఫోన్ మాట్లాడుకో అని చెప్పినట్లు వివరించింది. చైతన్యం ఫర్ ఫెక్ట్ జెంటిల్ మ్యాన్ అని.. ఫైనాన్షియల్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత సమంత చై పై పాజిటివ్ కామెంట్స్ చేయడం అక్కినేని అభిమానులకు చాలా ఆనందాన్నిచ్చింది. అయితే భవిష్యత్తులో వీరు కలిసిపోతే బాగుండని చాలా మంది కోరుకుంటున్నారు. వీరు విడాకులు తీసుకొని మూడు నెలలు గడుస్తున్నా.. ఇంకా ఈ విషయంపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. చై, సామ్ ల జంటను చూసి ఎంతో మంది ప్రేమ వివాహాలు చేసుకున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.