టాలీవుడ్ హీరోయిన్స్ లో సమంత ఒక్కరు. కోలివుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా రానిస్తుంది. తమిళ సినిమా నుండి తెలుగు సినిమాలోకి వచ్చింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏ మాయా చేసావే అనే చిత్రంలో అక్కినేని నాగ చైతన్య తో కలిసి నటించింది. ఆ సమయంలో ఏర్పడిన ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. పెళ్లి కార్డ్ తో శుభం పలికారు.
ప్రస్తుతం ఈ జంట మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు సినిమాకు చెందిన వ్యక్తులే కావడంతో ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఇక సమంత విషయానికి వస్తే లేడి సూపర్ స్టార్ నయనతార లాగా లేడి ఓరియెంటెడ్ మూవీస్ లలో నటిస్తుంది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూ మరో వైపు ఇంస్టా గ్రామ్ లోకూడా ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూ ఉంటుంది. ఫాలోవర్స్ ను కూడా ఓ రేంజ్ లో పెంచుకుంటూ పోతుంది. ఇప్పుడు ఆ క్యూ 15 లక్షల కు చేరుకుంది.
మరి ఇంత ఫాలోవర్స్ ఏంటి సమంత నీకు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. నాగ చైతన్య తో ఆ మధ్య మాల్దీవులకు వెళ్లినప్పుడు సమంత తన గ్లామర్స్ ఫోటోలను షేర్ చేసింది. ఆ సమయంలో కొంతమంది నెగటివ్ కామెంట్స్ చేసిన అవేమీ పట్టించుకోకుండా సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. సమంత జిమ్ లో వ్యాయామం చేస్తున్న ఫోటోలు ఎన్నో వైరల్ గా మారాయి. అక్కినేని ఫ్యామిలీ నుండి కూడా సమంత కు ఫుల్ సఫోర్ట్ ఉండటంతో బ్యాడ్ కామెంట్స్ చేసిన లైట్ గానే తీసుకుంటుంది.
సమంత సినిమాలోనే కాకుండా ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. అదే కాకుండా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా లో సామ్ జామ్ టాక్ షో తో హోస్ట్ గా రానిస్తుంది.