మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు లు నటించిన మల్టీ స్టారర్ మూవీ వి. దిల్ రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించాడు. లాక్ డౌన్ సమయంలో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. ఆ చిత్రంలోని మొబైల్ ఫోన్లో సెక్స్ వర్కర్ ను చూపించే సన్నివేశంలో సాక్షి మలిక్ ఫోటోను చూపించడంతో ఆమె బొంబే హై కోర్టులో కేస్ వేసింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలిసిందిగా ఆ చిత్ర నిర్మాత దిల్ రాజును కోరడం జరిగింది.
తక్షణమే ఆ సన్నివేశాని తొలగించాలని డిమాండ్ చేసింది. అదే కాక వెంటనే వి చిత్రాని అమెజాన్ ప్రైమ్ నుండి తొలగించాలని కోరడం జరిగింది. సోనూ కి టీటూ కి స్వీటి వంటి సూపర్ హిట్ట్ చిత్రంలో నటించింది అది కాక ఆమె ప్రముఖ మోడల్ కూడాను అలాగే సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏకంగా ఇంస్టా లో 60 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి సెలబ్రేటిని ఆమె పర్మిషన్ లేకుండా ఆమె ఫోటోను వాడటం తప్పని బొంబే హై కోర్టు తేల్చి చెప్పింది.
ఆ ఫోటోను తొలగించిన తర్వాత ఆమెకు ఓసారి సినిమా చూపించి మరల అమెజాన్ ప్రైమ్ లో ప్రదర్శన చేసుకోవచ్చు అని చెప్పింది. ప్రస్తుతం వి చిత్రాని అక్కడి నుండి తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సాక్షి అభిమానులు అంతర్జాలంలో దిల్ రాజు పై కామెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రంను నిర్మిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా లెవల్ సినిమాను నిర్మించనున్నాడు.