ఫిదా బ్యూటీ సాయి పల్లవి తెలుగు, తమిళ, మలయాళ సినిమాలో హీరోయిన్ గా రానిస్తుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో మరో నటుడుగా రానా నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే విరాటపర్వం సినిమాలో నటించింది. నాని శ్యామ్ సింగరాయ్ చిత్రంలో నటిస్తుంది.
ఇంత బిజీగా ఉన్న సాయి పల్లవి సోషల్ మీడియాలో తన అభిమానులతో ఫ్యామిలీ అండ్ వర్క్ లైఫ్ విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుత జెనరేషన్ లో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ పెళ్లి చేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. లైఫ్ లో చాలా మంచిగా సెట్టిల్ అవ్వుతేనే పెళ్లిపై దృష్టి పెడుతున్నారు. ఇదే బాటలో సాయి పల్లవి కూడా ప్రయాణిస్తుంది. పెళ్లి విషయమై ఆమె మరోసారి స్టేట్ మెంట్ ఇచ్చింది.
అసలు పెళ్లి అంటే ఇష్టమే లేనట్లుగా మాట్లాడుతుంది. తనకు తన తల్లి దండ్రులతో ఉండటమే ఇష్టం అంట. ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ లాంటి వాడు అయితే ఆమె పెళ్లి చేసుకుంటా అంటుంది. ఎందుకంటే తనను అర్థం చేసుకుని తన తల్లి దండ్రులతో పాటుగా కలిసి పోయే అబ్బాయి వస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెబుతుంది. కానీ కారణం మాత్రం ఇది కాదని ఆమె అభిమానులు అంటున్నారు మరేదైనా కారణం ఉండొచ్చు అంటున్నారు.
అయితే ఆమె కాలేజీ చదివే రోజుల్లో ఓ అబ్బాయి ని బాగా ప్రేమించింది. ఈ విషయం ఆమె ఓపెన్ గానే చాలా ఇంటర్వ్యూ లో చెప్పింది. అసమయంలో ఆమె ప్రేమ విఫలం కావడంతో మరల పెళ్లిపైకి ఆమె మనసు పోవడం లేదు. అందుకే పెళ్లి అనే పదానికి దూరం గా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. శేకర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే చిత్రంలో నటించింది. నాగ చైతన్య హీరో గా నటించాడు. ఈ చిత్రం ఏప్రిల్ 16 న విడుదల అవ్వుతుంది.