మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సొ బెట్టర్ అనే చిత్రంలో నటించాడు. గత ఏడాది చివర విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫల్టీలు కొట్టింది. ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలే పోయింది. సాయి కి జోడీగా నభా నటేష్ నటించింది. థమన్ సంగీతం అందించగ యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం 13 చిత్రాలు పూర్తి చేసుకున్నాడు.
సాయి ధరమ్ తేజ్ మరో రెండు చిత్రాలను లైన్ లో పెట్టాడు. దేవకట్ట దర్శకత్వంలో (SDT14) వ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు అనే వార్తలు వస్తున్నాయి. నివేత పేతురజ్, రాశి ఖన్నా హీరోయిన్లు గా నటిస్తున్నారు. రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఏప్రిల్ 30 న ఈ చిత్రం విడుదల కానున్నది. గతంలో దేవకట్ట వెన్నెల, ప్రస్థానం, ఆటొ నగర్ సూర్య అనే సూపర్ హిట్టు చిత్రాలను తీశాడు.
సాయి ధరమ్ తేజ్ (SDT15) మూవీ వచ్చేసి కార్తీక్ దండు అనే కొత్త దర్శకుడి తో చెయ్యనున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ రైటింగ్స్ , శ్రీ వేంకటేశ్వర సినీ చిత్రా బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. సాయి కి ఈ నిర్మాత తో ఇది రెండో చిత్రం అవ్వుతుంది. సోలో బ్రతుకే సొ బెట్టర్ అనే చిత్రం ఎస్విసిసి బ్యానర్ లోనే చేశాడు. ఈ చిత్రం డిసెంబర్ 24 న విడుదల కానున్నది. వరస ఫ్లాప్స్ ఉన్న సాయి ఈ రెండు చిత్రాలపై గట్టి నమ్మకం పెట్టుకున్నాడు.