టాలీవుడ్ లో విడాకుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదటగా నాగ చైతన్య, సమంత విడిపోయి తమ అభిమానులను షాక్ చేశారు. ఆ తర్వాత ఇలాగే మరికొన్ని జంటలు కూడా తాము విడిపోతున్నట్లు ప్రకటించాయి. అయితే తాజాగా జేడీ చక్రవర్తి తన భార్య విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ జేడీ చక్రవర్తి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
అయితే రాం గోపాల్ వర్మ తన సమర్పణలో సావిత్రి అనే సినిమా తీయాలనుకున్నాట. అందులో హీరోయిన్ గా అనుకృతి గోవింద్ శర్మను తీసుకున్నారట. ఫొటో షూట్ అయ్యి పోస్టర్స్ రిలీజ్ చేశాక.. కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయిందట. కానీ ఆర్జీవీ శిష్యుడు అయిన జేడీ చక్రవర్తి మాత్రం హీరోయిన్ అనుకృతితో లవ్ లో పడ్డాడట.
45 ఏళ్లు దాటిని పెళ్లి చేసుకోని జేడీ.. అతికొద్ది మంది సమక్షంలో అనుకృతిని పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే పెళ్లై అయిదేళ్లు గడుస్తోంది. వీరి జంట గురించి పెద్దగా వార్తలు ఏం రాలేవు. కానీ తాజాగా వారు విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
లేటు వయసులో పెళ్లి చేసుకున్నప్పటికీ.. జేడీ చక్రవర్తి ఓ ఇంటి వాడయ్యాడనన్న వార్త అతడి అభిమానులను సంతోషపరిచింది. కానీ ఇప్పుడొస్తున్న విడాకుల వార్తలు మాత్రం అతడి అభిమానుల హార్ట్ ను బ్రేక్ చేస్తోంది. ఈ వార్తలన్నీ పుకారు అయితే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై అటు జేటీ చక్రవర్తి కాని ఆయన భార్య అనుకృతి కానీ స్పందిస్తే తప్ప ఏం తెలిసేలా లేదు.