టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ (రణం రౌద్రం రుధిరం). రామ్ చరణ్ , ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ తారలు అజయ్‌దేవ్‌గన్, అలియా భట్ నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోగా..ఈ మధ్యనే షూటింగ్ పున : ప్రారంభం అయ్యింది.
అయితే ఈ భారీ ప్రాజెక్ట్ ను రాజమౌళి ఎప్పుడు విడుదల చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పరిస్థితుల రీత్యా ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతున్న ఈ చిత్రాన్ని ఓ సమయానికి రాజమౌళి లాక్ చేసినట్టుగా సినీ వర్గాల్లో గట్టిగానే ప్రచారం జరుగుతుంది. ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరా సీజన్ కు విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఇది నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది.