తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ను నేటి నుండి ప్రారంభించినట్లుగా అధికారికంగా ప్రకటించారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఏడు నెలల క్రితం కరోనా కారణంగా నిలిచి పోయింది.
అప్పటి నుండి కూడా అదుగో ఇదుగో అంటూ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు మళ్లీ షూటింగ్ ను పునః ప్రారంభించడంతో మళ్లీ చర్చ మొదలైంది. సినిమా షూటింగ్ ప్రారంభించినట్లుగా ప్రకటించిన చిత్ర యూనిట్ సభ్యులు రేపు సర్ ప్రైజింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. అది కచ్చితంగా ఎన్టీఆర్ వీడియోకు సంబంధించిందే అయ్యి ఉంటుందని అంతా భావిస్తున్నారు.
దసరా వరకు ఎన్టీఆర్ వీడియో వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కాని ఆర్ఆర్ఆర్ మేకర్స్ అప్ డేట్ ను బట్టి చూస్తుంటే అంతకు ముందే ఎన్టీఆర్ లుక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఉన్నారు. మొత్తానికి ఎన్టీఆర్ అభిమానులకు రేపు అతి పెద్ద గుడ్ న్యూస్‌ను జక్కన్న వినిపించబోతున్నారు. హిందీ స్టార్స్ అజయ్ దేవగన్ మరియు ఆలియా భట్ లు ఈ సినిమాలో నటించబోతున్నారు. నేటి నుండి ప్రారంభం అయిన షూటింగ్లో ఇంకా హీరోలు ఎవరు జాయిన్ అవ్వలేదు. రెండు రోజుల తర్వాత ఎన్టీఆర్ జాయిన్ అవ్వబోతున్నాడు.
ఈ నెల చివర్లో రామ్ చరణ్ కూడా జాయిన్ అవ్వబోతున్నాడు, రెండు నెలల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకునేందుకు సిద్దం అయ్యారు. ఇంగ్లీష్ నటి ఒలివియా కూడా ఈ సినిమాలో నటించేందుకు ఈ ఏడాది చివర్లో ఇండియాకు రాబోతుంది. మొత్తానికి రేపు రాబోతున్న బిగ్ సర్ ప్రైజింగ్ అప్డేట్ ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.