మోస్ట్ అవైటెడ్ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా కోసం కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ చిత్రంపై అటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకుల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. ఆర్.ఆర్.ఆర్ మూవీపై అదే స్థాయిలో అంచనాలు కూడా నెలకొన్నాయి. దాదాపు రూ.450 కోట్లతో నిర్మించిన ఆర్.ఆర్.ఆర్ భారీ బడ్జెట్ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్.టీ.ఆర్ నటిస్తున్నారు. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, ఎన్.టీ.ఆర్ కొమురం భీమ్ లను పోలిన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా ఇప్పటికే పూర్తి అయినప్పటికీ.. సినిమా మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని రామ్ చరణ్, జూనియర్ ఎన్.టీ.ఆర్ అభిమానులు తెగ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. జనవరి 7 వ తేదీన ఆర్.ఆర్.ఆర్ విడుదల కావాల్సి ఉన్నా… కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో.. చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతో థియేటర్లు మూత పడ్డాయి. ఆ కారణంగా విడుదల ఆగి పోయింది. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా వసూళ్లు రాబట్టుకోవాలంటే థియేటర్స్ ఓపెన్ లో ఉండాలని భావించిన ఆర్.ఆర్.ఆర్ దర్శక నిర్మాతలు సినిమాను వాయిదా వేశారు. జనవరి 7 నే రిలీజ్ అని ఫిక్స్ అయిపోయిన ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రచారం చేసింది.
ఇదిలా ఉండగా… చిత్ర యూనిట్ మాత్రం పలు రాష్ట్రాలు, దేశాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట‌్లను నిర్వహిస్తోంది. అయితే మాత్రం పలు అన్ని దేశాల్లో అయితే ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించిన విషయం మనకు తెలిసిందే. అజయ్ దేవగణ్, సముద్ర ఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీత మందించగా… రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.