సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్ సినిమా లు విడుదల అవుతాయని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఆ రెండు సినిమా లు కూడా వాయిదా పడ్డట్లే. ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో విడుదల కష్టం అని నిర్ణయానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి బాగానే ఉన్నా పక్కన ఉన్న తమిళనాడు సహా ఉత్తర భారతంలో పలు రాష్ట్రాల్లో కూడా ఆంక్షలు అమలు చేస్తున్నారు. దాంతో సంక్రాంతి బరి నుండి ఆ రెండు సినిమా లు తప్పుకున్నాయి. దాంతో వెంటనే తమ సినిమాను రంగంలోకి దించాలని భీమ్లా నాయక్ మేకర్స్ అనుకుంటే మా సినిమా కూడా వస్తుందని దిల్ రాజు రౌడీ బాయ్స్ సినిమా ను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
దిల్ రాజు సోదరుడు అయిన లక్ష్మణ్ తనయుడు అశ్విన్ హీరోగా రూపొందిన రౌడీ బాయ్స్ సినిమా కు మంచి క్రేజ్ ఉంది. కనుక సంక్రాంతికి విడుదల చేస్తే తప్పకుండా మంచి పలితం ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు చాలా తెలివిగా సినిమా ను విడుదల కు తీసుకు వచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజు మరియు ఇతర నిర్మాతలు అంతా మాట్లాడి క్లాష్ కాకుండా డేట్లను నిర్ణయించే అవకాశం ఉంది. దిల్ రాజు ఇప్పటికే తన ఎఫ్ 3 సినిమా ను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి కాని ఆ సినిమా విడుదలకు సిద్దంగా లేదు. రౌడి బాయ్స్ మాత్రమే సిద్దంగా ఉంది కనుక సంక్రాంతికి ఆ సినిమా ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో సినిమా వసూళ్లు మాత్రం నిలకడగా ఉంటున్నాయి.
సినిమా సక్సెస్ టాక్ దక్కించుకుంటే వంద కోట్లు కూడా తెలుగు ప్రేక్షకులు ఇస్తున్నారు. కనుక సంక్రాంతికి భీమ్లా నాయక్ తో పాటు వచ్చినా కూడా రౌడీ బాయ్స్ కు మంచి ఆధరణ దక్కుతుందనే నమ్మకంతో దిల్ రాజు ఉన్నాడట. తన వారసుడిగా దిల్ రాజు అశ్విన్ ను తీసుకు రాబోతున్నాడు. మరి ఆ విషయంలో దిల్ రాజు ఆలోచన ఎంత వరకు కరెక్ట్.. భీమ్లా నాయక్ తో పోటీగా వస్తాడా లేదంటే ఆర్ ఆర్ ఆర్ వదిలేసిన జనవరి 7న వస్తారా అనేది చూడాలి.