కింగ్ నాగార్జున హోస్ట్ గా వచ్చిన బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ కు ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు. రోహిత్ కుటుంబం మహారాష్ట్రలో సెటిల్ అయినప్పటికి ఆయనకి తెలుగు మూలాలు ఉన్నాయి. ఆయన తల్లి గారిది హైదరాబాద్ నే. హిట్ మ్యాన్ తెలుగు చక్కగా మాట్లాడగలడు కూడా. బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ ను అభిజిత్ గెలుచుకునందుకు స్వయంగా రోహిత్ ఫోన్ చేసి అభినందించాడు అంట.
“విత్ లవ్ అండ్ బెస్ట్ విషెస్” అని రాసి తాను సంతకం చేసిన జెర్సీని అభిజిత్ కు పంపించాడు అంట ఈ విషయాని స్వయంగా అభిజిత్ తెలియజేశాడు. ఈ సందర్భంగా అభిజిత్ హనుమ విహారికి కూడా థాంక్స్ చెప్పాడు. ఆస్ట్రేలియా తో జరిగిన మూడో టెస్ట్ లో ఓటమి దిశగా కొనసాగుతున్న టీమిండియా ను డ్రా ముగించినందుకు. వీరిద్దరు ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నారు.
అభిజిత్ కూడా సినిమాలోకి రాక ముందు క్రికెటర్ కావాలని అనుకునేవాడంట. మనం ఒక్కటి తలుస్తే దైవం ఒక్కటి తలుస్తుందని క్రికెట్ ను కాదని సినిమాలోకి వచ్చాను అన్నాడు. అలాగే రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎన్ని పనులు ఉన్న పక్కన బెట్టి అతని బ్యాటింగ్ ఆస్వాదిస్తాను అని తెలిపాడు. రోహిత్ శర్మ, హనుమ విహారి మధ్య తెలుగు రాష్ట్రాలకు సంబందించిన అంశంపై చర్చ వచ్చింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ను కూడా వారు చర్చించుకున్నారు. బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ రోహిత్ శర్మ గిఫ్ట్ అందించడంపై ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. రోహిత్ శర్మకు నేను పెద్ద అభిమానినన్ని తెలియజేశాడు.