సుశాంత్ మృతి కేసులో రియా పీకల్లోతు ఇరుక్కుందని అంతా అన్నారు. ఆమె కారణంగానే సుశాంత్ మృతి చెందాడు. ఆమెను ఒకానొక సమయంలో హంతకురాలు అని, విషకన్య అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దాంతో ఆమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే రియా కేసు విషయంలో చాలా మంది చాలా రకాలుగా ప్రచారాలు చేస్తున్న ఈ సమయంలో సీబీఐ ఎంక్వౌరీ జరుగుతోంది.
ఈ ఎంక్వౌరీలో రియా గత నాలుగు రోజులుగా విచారణకు హాజరు అవుతోంది. మరో మూడు రోజుల పాటు కూడా ఆమె విచారణకు హాజరు అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటి వరకు సీబీఐ వారికి సుశాంత్ కు మృతికి రియా కారణం అయ్యి ఉంటుంది అనే విషయంలో క్లూ లభించలేదట. ఆమె సుశాంత్‌ను ప్రేమించిన మాట వాస్తవం. అయితే సుశాంత్ నుండి జూన్ 8వ తారీకున విడిపోయింది.
ఆ తర్వాత అతడు ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. కాని ఆమె మాత్రం అతడితో సంబంధంను కొనసాగించలేదు. అతడి నెంబర్ బ్లాక్ చేసింది. కనుక ఆమెకు అతడి నుండి ఎలాంటి కాల్స్ రాలేదు. చనిపోయిన సమయంలో అతడి మానసిక పరిస్థితి బాగాలేదు. అందుకు మాత్రం రియా కారణం అనే అనుమానాలు ఉన్నాయి. అందుకు రియాను కారణం చేయలేము.
కనుక ఈ కేసు నుండి రియాకు క్లీన్ చీట్ దక్కే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ కుటుంబ సభ్యలు ఈ కేసులో ఆమెను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణల ప్రకారం రియా నుండి వారు ఏదో ఆశిస్తున్నారి అందుకు నో అనడం వల్ల ఆమె ను ఇరికిస్తున్నారని కొందరు అంటున్నారు. ఆ విషయంలో కూడా సీబీఐ వారు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.