రామ్ గోపాల్ వర్మ కెరీర్ స్టార్టింగ్ లో వరస హిట్స్ తీశాడు. ఎంతో మంది హీరోలు ఆయన స్కూల్ నుండి వచ్చిన వారే ఉన్నారు. చాలా మంది దర్శకులు వర్మను ఆదర్శంగా తీసుకుంటారు. బాలీవుడ్ లోనూ వర్మకు విపరీతమైన డిమాండ్ ఉంది. అక్కడ ఆయన తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి, రంగీల, సత్య, భూత్, సర్కారు చిత్రాలు రామ్ గోపాల్ వర్మకు మంచి గుర్తింపు తెచ్చాయి. అమితాబ్ బచ్చన్ తో ఆయన తీసిన సర్కార్ సినిమా పెద్ద వివాదాన్నేఅక్కడ సృష్టించింది.
ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలు వరస ఫ్లాప్స్ రావడంతో టాలీవుడ్ కు ప్రయాణం అయ్యాడు. ఇక ఇక్కడ ఆయన ఈ మధ్య కాలంలో తీసిన సినిమాలు మొత్తం వివాదం రేపాయి. బయోపిక్ ల పేరుతో తీసిన సినిమాలు డిజాస్టర్ గా మారాయి. వర్మ నుండి సినిమా వస్తుందంటేనే ప్రేక్షకులు మరో వివాదం ఏదో తీసుకువస్తున్నాడు అనే వరకు వచ్చింది. గత పదేళ్ళలో ఆయన నుండి మంచి హిట్ట్ సినిమా మాత్రం రాలేదు. ప్రస్తుతం ఆర్జివి “డి కంపెనీ” అనే చిత్రంను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ప్రకటించాడు. చాలా మంది నెటిజన్స్ మాత్రం మాఫియా డాన్ దావూద్ ఇబ్రాహిం జీవిత చరిత్ర అంటున్నారు.
ఈ విషయంపై వర్మ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. ఎందుకో “డి కంపెనీ” సినిమా విషయంలో బయపడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఆయన తీసిన చాలా చిత్రాలు వివాదం రేపినవే. ఎంతో మంది వర్మ ను బయపెట్టారు కూడా కానీ వారి బెదిరింపులకు బయపడిన వర్మ “డి కంపెనీ” కథ ఎవరిది అనే విషయం ను చెప్పలేకపోతున్నాడు. దావూద్ జీవిత చరిత్ర అయితే వర్మ ఎందుకు చెప్పడని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. వర్మ దావూద్ గ్యాంగ్ కు బయపడుతున్నాడు అంటున్నారు. సినిమాకు ముందు వివాదాన్ని సృష్టించే వర్మ “డి కంపెనీ” చిత్రంపై మౌనం గా ఉండటాని నెటిజన్స్ బయపడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మాఫియా డాన్ దావూద్ కు అల్ ఓవర్ ఇండియా లో నెట్వర్క్ ఎక్కువ అందుకే వర్మ భయపడుతున్నట్లు తెలుస్తుంది.