బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మృతి కేసును ఎంక్వయిరీ చేస్తూ ఉండగా బయటపడ్డ డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉందనే అనుమానంతో హీరోయిన్ రియా చక్రవర్తిని ఎన్ సి బి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజులుగా ఆమె బైకుల జైల్లో గడిపారు. ఎట్టకేలకు ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుండి బయటకు వచ్చారు.
దాదాపుగా నాలుగు సార్లు ఆమె బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు ఈసారి విచారణ ముగింపు దశకు వచ్చిందని అలాగే ఆమెను విచారించడం పూర్తి అయ్యిందనే కారణంగా బెయిల్ మంజూరు చేసినట్లుగా పేర్కొంది. ఆమెకు నిబంధనలతో కూడిన బెయిల్ ను ఇస్తున్నట్లుగా కోర్టు ప్రకటించింది. దాంతో నెల రోజుల తర్వాత ఆమె ఈ రోజు జైలు నుండి బయటకు వచ్చింది. జైలుకు వెళ్లినప్పటి నుంచి రియా చక్రవర్తి చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
సరైన భోజనం లేక పోవడం వల్ల ఆమెకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తాయని వారు చెప్పారు. చక్రవర్తి బయటకు వచ్చిన సమయంలో ఆమె కాస్త నీరసంగా అనిపించింది. అంతకుమించి ఏ ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లుగా అనిపించలేదని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆమె ఇంటర్వ్యూ కోసం మరియు ఆమెతో మాట్లాడడం కోసం జాతీయ మీడియా తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. కానీ ఆమె మాత్రం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది.