
ఛలో, గీతా గోవిందం, దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, డియర్ కామ్రేడ్, పుష్ప వంటి హిట్టు సినిమాల్లో నటించిన రష్మికా మందన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది.

అందంతో పాటు అభినయం, అదృష్టం కలగలసిన ఈ కన్నడ భామ తాజాగా విజయ్ సినిమాలో మరో ఛాన్స్ కొట్టేసింది. పుష్ప సినిమాలో రాయలసీమ యాసలో సూపర్ గా మాట్లాడుతూ… అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం పందింది.

తమిళ సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ ప్రస్తుతం దిలీప్ దర్శకత్వంలో జీస్ట్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సినిమాను ఆయన వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా రష్మికా మందన్నాను తీసుకున్నారు.

ఇక మరో కథానాయికకు కూడా ఈ సినిమాలో ఛాన్స్ ఉందట. ఆ పాత్రకు హూజా హెగ్డేను తీసుకుంటే బాగుంటుందని వంశీ పైడిపైల్లి అనుకుంటున్నారట. అయితే పూజ ఇప్పటికే విజయ్ తో బీస్ట్ సినిమాలో చేస్తోంది. కాబట్టి పూజ వంశీ పైడిపల్లి సినిమాలో కనిపించే ఛాన్స్ తక్కువని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.