రష్మి, సుధీర్ లు ఇద్దరు కూడా జబర్దస్త్ షో ద్వారానే బాగా పాపులర్ అయ్యారు. అంతకు ముందు రష్మి అప్పుడప్పుడు సినిమాలో కనిపించిన అంతగా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే జబర్దస్త్ షో లో యాంకర్ గా అడుగు పెట్టిందో సుధీర్, రష్మి మధ్య వచ్చే రొమాంటిక్ కామిడీ లవ్ సీన్స్ ద్వారా ఆమె మరింత గుర్తింపు తెచ్చుకుంది. సుధీర్ కూడా జబర్దస్త్ షోలోకి రావడానికి చాలా కష్టపడాడు. ఇక ఈ షోలోకి రావడానికి ముఖ్య కారణం కమేడియన్ వేణు. సుధీర్ కూడా ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాడు.
ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ పేరుతో ఎన్నో సూపర్ హిట్స్ స్కిట్స్ ను చేశాడు. సుధీర్ చేసిన జబర్దస్త్ స్కిట్స్ కి యూట్యూబ్ లో లక్షలల్లో వ్యూస్ వస్తుంటాయి ఆ రేంజ్ లో సుధీర్ కి సోషల్ మీడియాలో డిమాండ్ ఉంది. ఎప్పటి నుండో సుధీర్ రష్మిల మధ్య లవ్ ఎఫ్ఫైర్స్ నడుస్తుందని సినిమా ఇండస్ష్ట్రి లో టాక్ ఉంది. వారిద్దరీ మధ్య ఆ గాసిప్ రావడానికి కారణం సుధీర్ ఎప్పుడు రష్మి వెంట పడుతూనే ఉంటాడు. మరోసారి రష్మి, సుధీర్ పెళ్లి విషయం వార్తల్లో నిలిచింది. ఈ సారి ఆ గాసిప్ ను తీసుకు రావడానికి రోజా గారు కారణం అయ్యారు.
తాజాగా ఎక్ష్త్ర్స్ జబర్దస్త్ షో కి సంబందించిన ప్రోమోను ఈటివి యజమాన్యం విడుదల చేసింది. పెళ్లి కన్సెప్ట్ తో సరదా సత్తి పండు అదుర్స్ ఆనందం చేసిన స్కిట్ లో సుధీర్ గెస్ట్ గా వచ్చాడు. ఆ స్కిట్ పూర్తి అయిన తర్వాత రోజా గారు సుధీర్ ని పెళ్లి ఎప్పుడు అని అడుగుతుంది. సుధీర్ రష్మి వైపు చూసి సిగ్గు పడుతాడు. రోజా రష్మి వైపు చూసి రష్మి ని పెళ్లి ఎప్పుడని అడుగుతుంది రష్మి సుధీర్ వైపు చూస్తుంది. సుధీర్ అందుకు సమాదానంగా త్వరలో చేసుకుంటాను మేడమ్ అని చెబుతాడు. ఆ తర్వాత రోజా పంచ్ వేసి అందరిని నవ్విస్తుంది. మరి సుధీర్ రష్మి ల పెళ్లి విషయం ఎప్పుడో తెలియాలంటే వచ్చే శుక్రవారం వరకు అగాలిసిందే.