రష్మి, సుధీర్ కు జబర్దస్త్ షో ద్వారానే మంచి గుర్తింపు వచ్చింది. రష్మి మొదట నుండి సినిమాలు చేస్తున్న కానీ ఆమెకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు. ఎప్పుడైతే బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ ను మొదలు పెట్టిందో అప్పుడే ఆమె లైఫ్ టర్న్ అయిపోయింది. జబర్దస్త్ షో ఆమెకు మరింత పేరును తీసుకువచ్చింది. సుధీర్ రష్మి పై వేసే పంచులు మామూలుగా ఉండవు. దానికి కౌంటర్ గా రష్మి కూడా సుధీర్ పై రివర్స్ కౌంటర్స్ వేస్తూనే ఉంటుంది.
జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన వీరిద్దరు డ్యాన్స్ షో ఢీ ద్వారా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ షో లో వీరిద్దరు చేసే డ్యాన్స్ లు కానీ స్కిట్స్ కానీ చూస్తే వీరి మధ్య లవ్ ఎఫ్ఫైర్ ఉందని అనిపిస్తుంది. ఆ విదంగా రెచ్చిపోయి మరి చేస్తుంటారు. కానీ నిజానికి వారు అలా చేయడానికి ముఖ్య కారణం దర్శకులు. షో నిర్వాహకులు చెప్పడం మేరకే అని రష్మి మరియు సుధీర్ లు చాలా ఇంటర్వ్యూ లో చెప్పారు.
అల ఎన్నోసార్లు క్లారీటి ఇచ్చిన కానీ అభిమానులు, ప్రేక్షకులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. తాజాగా ఢీ ప్రోగ్రాం కు సంబందించిన లేటెస్ట్ ప్రోమో ఒక్కటి విడుదల అయింది. అందులో వెంకటేష్, త్రిష జంటగా నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే చిత్రం నుండి సాంగ్ ప్లే అవ్వుతుంది. అప్పుడు సుధీర్, రష్మిని తన చేతులతో పైకి ఎత్తుకొని కొద్ది సేపు అలాగే ఆమె కళ్లలో చూస్తూ ఉంటాడు. అప్పుడు రష్మి సుధీర్ వైపు చూసి చేతితో సైగ చేస్తుంది. అప్పుడు సుధీర్ ఆమెను తన నుండి క్రిందకు దింపుతాడు. ఈ ప్రోమో చూస్తే సుధీర్ కు రష్మి అంటే ఎంత ఇష్టమో అర్థం అవ్వుతుంది.