ఏ సినిమా ఇండస్ష్ట్రి అయిన సరే హీరోయిన్ గా రాణించాలంటే నటన ఒక్కటే సరిపోదు అందం తో పాటుగా అందుకు తగిన విదంగా ఫిజిక్ మెయింటైన్ చేయాలి. లాక్ డౌన్ సమయంలో సినిమాలు లేక చాలా మంది హీరోయిన్స్ ఇదే పనిలో ఉన్నారు. అందులో ముఖ్యులు రాశిఖన్నా. ఊహలు గుసగుస లాడే సినిమా ద్వారా తెలుగు సినిమా కు పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత కుర్ర హీరోల సినిమాలో ఛాన్స్ లు కొట్టేసింది.
వరుణ్ తేజ్, సాయి తేజ్, ఎన్టిఆర్ వంటి స్టార్ హీరోల పక్కన నటించింది. ప్రస్తుతం రాశిఖన్నా ఫిజిక్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాలిసిందే అంతలా తన బాడి షేప్ లను మార్చుకుంది. తాజాగా ఆమె అద్దం ముందు నిలబడి ట్రేడ్ మిల్ల్ పై రన్నింగ్ చేస్తూ దిగిన ఫోటోను ఆమె తన ఇంస్టా లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవ్వుతుంది. అందుకు క్యాప్షన్ గా ఇంట్లో కూర్చోని ఉంటే కావలిసిన ఆకృతి పొందలేము అంటుంది. సోషల్ మీడియాలో అమ్మడికి బాగా ఫాలోయింగ్ ఉంది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన ఫోటోలను, జిమ్ వర్క్ ఔట్స్ ను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం తెలుగులో ఓ ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సాయి ధరమ్ తేజ్ 15 వ సినిమాలో ఆమె నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కోలివుడ్ లో ఓ నాలుగు చిత్రాలు, మలయాళంలో నుండి ఓ చిత్రం ఆమె చేతిలో ఉంది. హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. షాహిద్ కపూర్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ లో అవకాశాలు పట్టాలని చూస్తుంది. ప్రస్తుతం పూజ హెగ్డే, రష్మిక మందన, సాయి పల్లవి,వంటి కుర్ర హీరోయిన్స్ దూసుకువస్తున్నారు. అలాంటి వారికి పోటీగా సినిమాలో రానివ్వాలంటే ఆ మాత్రం ఫిజిక్ రాశిఖన్నా కు అవసరం.